గుణపాఠం
ఈ రోజు ఒక పులి కథ చెప్పబోతున్న అది ఎలాంటి పులి అంటే తాను చాలా బలమైన పులి తనని అడవిలో జంతువులు ఏమి చేయలేవు అని దాని గర్వం! ఇక ఆ పులికి ఏ జంతువు ఎదురు పడేది కాదు! ఎన్నో కుందేళ్ళను, జింకలను వేటాడి క్రూరంగా చంపి తినేది! వయసులో పెద్దదైన ఎలుగుబంటి , ముసలి సింహం ఎన్నో సార్లు ఆలా క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తావు అని చెప్పిన ఆ పులి వాటి మాటలను లెక్క చేయలేదు! దానితో పోరాడే శక్తిలేక ముసలి సింహం ముసలి ఎలుగుబంటి మౌనంగా ఉండిపోయాయి. పులికి ఒకరోజు అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న ఇద్దరు మనుషులు కనబడ్డారు. ఇంకేం వాళ్ళని చంపి తినేసింది. ఆ అడవిలో మనుషులు నడిచే దారిలో మాటువేసి ఏ మనిషి అడవి గుండా ప్రయాణించిన వాళ్ళను తింటూ ఉండేది. ఆలా కొన్ని రోజులకి ఆ అడవి గుండా ప్రయాణించడం మనుషులు మానుకున్నారు. పులికి మనిషి మాంసం తినక ఆకలితో కోపం వచ్చింది. ఏంటి ఎవడు రావట్లేదు అని ఆ దారి దగ్గర అటు ఇటు రోజంతా తిరిగి తిరిగి కోపంతో ఆకలి కడుపుతో రాత్రి పడుకుంది. ఆలా కొన్ని రోజులు చూసి ఇక లాభం లేదు అడవిలోకి ఎవరు రావట్లేదు. నేను మనుషుల దగ్గరికి వెళ్తాను అని అనుకుని బయల్దేరింది. ఆదే సమయంలో ముసలి సింహం, ముసలి ఎలుగుబంటి ఎదురుగా వచ్చాయి" ఎక్కడికో బయలు దేరారు పులి బావ " అని ముసలి ఎలుగుబంటి అడిగింది. మనుషుల కోసం బయలుదేరాను . అని అంది. అయ్యో బావ వాళ్లకు ఏదైనా హాని చేస్తే వాళ్లకు ఊరుకుంటారా? ఇప్పటికే మేతకి వచ్చిన పశువుల్ని ఎన్నో నువ్వు తిన్నావు! నువ్వు ఇప్పుడు వాళ్ళ కంట పడితే వాళ్ళు నిన్ను ఊరికే వదలరు. చంపేస్తారు." అని హెచ్చరించాయి. దానికి పులి " నాకన్నా బలం ఎక్కువ ఉందా వాళ్ళకి .. చూద్దాం " అని ఆకలి కోపంతో అడవి నుండి అడవి పక్కనే ఉన్న ఊరి వైపు పరిగెత్తింది. ఎం జరుగుతుందో అని ముసలి సింహం ముసలి ఎలుగు బంటు ఆవేదనతో ఉన్నాయి . " సింహం బావ! ఎందుకు ఈ పులికి ఇంత ఆతృత క్రూరత్వం!" "ఎలుగు బావ! నడి వయస్సులో బలం ఉంటుంది. అది మనం మంచికోసం మన చుట్టూ ఉన్న వాళ్ళ క్షేమం కోసం వాడితే బాగుంటుంది. నేను ఒకప్పుడు ఈ అడవికి రాజును ఆ మర్యాద కూడా ఇవ్వకుండా పులి నడుచుకుంటుంది. ఇలాంటి వాళ్లకు కాలం తప్పక ఏదో ఒక రూపంలో బుద్ధి చెబుతుంది ఆలా వెళ్లిన పులి ఆరొవ రోజు అడవిలోకి వచ్చింది. పులిని చుసిన ముసలి సింహం ఎలుగుబంటి " అయ్యో పులి బావ! ఏంటి ? నీ వొళ్ళంతా వాతలు, రక్తం, పైగా పళ్ళు మొత్తం ఊడిపోయాయి. నీ బలం ఎక్కడ ఉపయోగించావు? అని నవ్వు కున్నాయి. కోపంతో బాధతో ఉన్న పులి మాట్లాడే ఓపిక లేక కర్రలతో, రాళ్లతో ఊరి ప్రజలు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక నేలపై పడి చనిపోయింది. ముందే ముసలి సింహం మాట విని ఉంటె ఈ గతి పులికి పట్టేది కాదు అని చనిపోయిన పులిని చూసి అడవిలో ఉన్న జంతువులు అన్ని అనుకున్నాయి. మనం చేసే పని మంచిదా చెడుదా అని మన మిత్రులు శ్రేయోభిలాషులు చెబుతూనే ఉంటారు. అయిదు సంవత్సరాలు పులికి చెప్పి చెప్పి విసిగి పోయిన ముసలి సింహం ఇలా జరిగినందుకు ఎంతో ఏడ్చింది. అడవిలో జంతువులకి గర్వం, క్రూరత్వం ఉంటె ఎలా అవుతుందో పులి జీవితం ఒక పాఠం అయింది.
0 Yorumlar